శైలేంద్రకి వార్నింగ్ ఇచ్చిన మహేంద్ర.. ఏంజిల్ కి రిషి నిజం చెప్తాడా?
on Sep 19, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -872 లో.. మురుగన్ చేసిన హెల్ప్ కి రిషి ఫోన్ లో థాంక్స్ చెప్తాడు. ఆ తర్వాత రిషి వెళదామని కార్ లోకి ఎక్కుతాడు. లోపల వసుధారని షాక్ అవుతాడు. కార్ లో నుండి వసుధారని దిగమంటాడు. అయిన నేను దిగానని వసుధార అనగానే.. చేసేదేమీ లేక రిషి బయల్దేర్తాడు.
మరొక వైపు రిషి వసుధారలు వెళ్లడం చూసిన జగతి, మహేంద్ర లు హ్యాపీగా ఫీల్ అవుతారు. రిషికి వసుధారపై మెల్లిమెల్లిగా కోపం తగ్గుతుందని ఇద్దరు అనుకుంటారు. మిషన్ ఎడ్యుకేషన్ విషయంలో రిషి కాలేజీకి రాకుండానే హెల్ప్ చేసాడు. ఇప్పుడు కాలేజీ గురించి కూడా కాలేజీకి రాకుండానే ప్రాబ్లమ్ క్లియర్ చేశాడని జగతి, మహేంద్ర అనుకుంటారు. మరొక వైపు రిషి వసుధారలు కార్ లో వెళ్తూ మాట్లాడుకుంటారు. ఏంటి సర్ అలా ఉన్నారని వసుధార అడుగుతుంది. కాలేజీ ప్రాబ్లమ్ అయితే క్లియర్ అయింది కానీ ఇంకొక ప్రాబ్లమ్ ఉందని ఏంజెల్ తనకి ఇచ్చిన పదిహేను రోజుల గడువుని ఉద్దేశించి అంటాడు. మరి మీరు ఏంజెల్ కి మీకు పెళ్లి అయిందా లేదా అన్న విషయం గురించి ఏం చెప్పాలని అనుకుంటున్నారని వసుధార అడుగుతుంది. అప్పుడే రిషి కార్ కి అడ్డుగా శైలేంద్ర వస్తాడు. ఏంటి అన్నయ్య ఇలా వచ్చారని రిషి అడుగుతాడు. నిన్ను తీసుకొని వెళదామని వచ్చాను రా వెళదామని శైలేంద్ర అంటాడు. నేను రాలేను అని రిషి అనగానే.. నువ్వు మాకు కావాలి రిషి అని చెయ్యి పట్టుకొని వస్తుండగా జగతి, మహేంద్ర వస్తారు. ఎందుకు వచ్చారు రిషి రాకుండా ఆపడానికి వచ్చారా అని శైలేంద్ర అంటాడు. అదంతా రిషి దృష్టిలో వాళ్లని బ్యాడ్ చెయ్యడానికి అలా మాట్లాడతాడు. నేను రానంటూ రిషి కార్ లో వెళ్తాడు. వసు కూడా తనతో వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత శైలేంద్రకి మహేంద్ర వార్నింగ్ ఇస్తాడు. ఇక నీ గురించి అందరికి త్వరలోనే తెలుస్తుందని మహేంద్ర అనగానే మీరు నా గురించి వాళ్ళతో చెప్పలేరని శైలేంద్ర అంటాడు. మరొక వైపు వసుధారని రిషి తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. లోపలికి వచ్చి టీ తాగి వెళ్ళండని వసుధార అడిగిన రిషి రానంటు వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read